తేది:15-03-2026 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చెందిన జాతీయ ఉగాది సేవా పురస్కారం అందుకున్న అందే శ్రీనివాసులు

0
21

✍🏻నెల్లూరుకు చెందిన ఎస్.వి.ఆర్.స్కూలు కరెస్పాండెంట్ అందే శ్రీనివాసులు ఎం.వి.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కోట మండలం లోని సాధీ మంజిల్ నందు జాతీయ ఉగాది సేవా పురస్కారాన్ని అందుకున్నారు. అందే శ్రీనివాసులు 25 సంవత్సరాలుగా విద్యా పరంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో సరస్వతీ విగ్రహాలు ప్రతిష్టించడం, అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు తోడ్పడుతున్నారు.

✍🏻10వ తరగతి సాధించిన మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్ తోపాటు బహుమతులు అందజేశారు. సేవా కార్యక్రమాల్లో అందే శ్రీనివాసులు చేస్తున్న కృషిని అభినందిస్తూ ముఖ్యఅతిధులు జాతీయ ఉగాది సేవా పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎం.వి.రావు ఫౌండేషన్ ఛైర్మన్ ఎం.లీలా మోహన్ కృష్ణ, మనం ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తి, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు, వివిధ జిల్లాల కళాకారులు, కవులు, స్వచ్చంధ సేవకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here