🌟Date:12-04-2026 ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బాలాజీ నగర్ నందు మేడిది సుబ్బయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంబొత్సవం….

0
13

✍🏻ఎండా కాలంలో చలివేంద్రాలు ఎంతో అవసరమని నెల్లూరు జిల్లా క్రైం రికార్డ్స్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎన్.రామారావు పేర్కొన్నారు. మేడిది సుబ్బయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు బాలాజీ నగర్ లోని మాగ్నెట్ ప్లెక్స్ ప్రింటింగ్ దగ్గర చలివేంద్రం ప్రారంభం జరిగింది.

✍🏻మొదటి రోజు మజ్జిగతో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదచారులకు వేసవి తాపాన్ని తీర్చాలంటే ఇటువంటి చలివేంద్రాలు సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

✍🏻రాష్ట్ర జర్నలిస్టు సంఘం నాయకులు ఎ.జయప్రకాష్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ మేడిది వెంకటేశ్వర రావు ఎంతో అభినందనీయులని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ చీదరాల చెన్నయ్య, విశ్రాంత ఉపకార్మిక కమీషనర్ డాక్టర్ రాచపాలెం రఘు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు ఎమ్.రోజా రాణీ, ఎస్.సౌజన్య, జోష్ణ, శ్రీకర్ రెడ్డి, భరత్ కుమార్ రాజు, అలీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here