
✍🏻వి.ఆర్.మునిసిపల్ కార్పోరేషన్ హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఎంతో ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. ఈకార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మరపురాని అనుభూతిని అందించింది. చిన్నారులు గ్రాడ్యుయేషన్ క్యాప్‌లు, గౌన్‌లు ధరించి ఎంతో అందంగా కనిపిస్తూ, గర్వంగా తమ సర్టిఫికేట్లు అందుకున్నారు…



✍🏻విద్యార్థులు పాటలు, నృత్యాలు, ప్రసంగాలతో తమ ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈసందర్భంగా ముఖ్య అతిథులుగా డా.ఎం.బి.రామమోహన్, డా.ఎ.యామిని, డా.కె.ఆర్. హర్షవర్ధన్ పాల్గొన్నారు. అలాగే నారాయణ, శరణి మరియు నారా లోకేష్ సేవలు, విద్యారంగంలో కృషి గురించి ప్రత్యేక ప్రసంగాలు నిర్వహించబడ్డాయి. మంత్రి నారాయణ, శరణి ఈపాఠశాల అభివృద్ధి కోసం చేసిన కృషిని పిల్లలు తమ చక్కని ప్రసంగాల ద్వారా ఎంతో హృదయపూర్వకంగా తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధి, విజయాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. హెచ్.ఎం వెంకటరావు, ఇన్‌చార్జ్ హెచ్.ఎం లక్ష్మీనారాయణ, పీడీ గురుప్రసాద్, వైస్ ప్రిన్సిపల్స్ చంద్రకళ, హరిత, జయలక్ష్మి, ఏ.ఓ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈవేడుకలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. ఈగ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఆనందకర వాతావరణంలో ముగిసి, అందరికీ చిరస్మరణీయ జ్ఞాపకాలను మిగిల్చాయి.


