
✍🏻మంగళవారం నాడు నెల్లూరు టౌనుహాలు ఏ.సి నందు సావిత్రిబాయి పూలే వర్ధంతి, మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు ఆదర్శ మహిళా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా జి.ఎస్.టి.అసిస్టెంట్ కమీషనర్ డాక్టర్ సి.హెచ్.ఉషా కిరణ్ మాట్లాడుతూ ఈనాడు మహిళలు అన్నీ రంగాల్లో మగాళ్లకు దీటుగా రాణిస్తున్నారు. మహిళల్ని మహిళా దినోత్సవం రోజుతోపాటు ప్రతి రోజూ గౌరవించాలని కోరారు.

✍🏻సంస్థ ఫౌండర్ & చైర్మన్ డాక్టర్ సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ చరిత్రలో తొలిసారిగా నినదించిన భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా మహిళా దినోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

✍🏻ముందుగా సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం పురస్కార గ్రహీతలు డాక్టర్ లలితా షిర్డీష, రేబాల గీతారెడ్డి, వి.కనక మహాలక్ష్మి, మీసాల వజ్రమ్మ, నాగారెడ్డి విజయనిర్మల, బి.గిరిజ నాగలక్షి, బి.రాజేశ్వరి, బి.కల్పన, సి.హెచ్.శరణ్యరెడ్డి, అవదానం భారతియులను శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, మాల, కిరీటదారణతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో అందే శ్రీనివాసులు, షేక్ రియాజ్ బాషా, ఎస్.వి.రమేష్ బాబు, నిర్వాహకులు మురళీమోహన్ రాజు, శివాజీ, రాచపాలెం రఘు, సుజాత, శివ పార్వతి, వల్లూరి సదాశివరావు, ఎమ్.రాజేంద్ర ప్రసాద్, చీదరాల చెన్నయ్య, రవి గోగులపల్లి తదితరులు పాల్గొన్నారు.


✍🏻ఆదర్శ మహిళా పురస్కారం అందుకున్న రేబాల గీతారెడ్డి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు మరియు అఖిల భారత అవయవ, శరీర దాతల సంఘం ఆధ్వర్యంలో టౌనుహాలు ఏ.సి నందు సావిత్రిబాయి పూలే వర్ధంతి, మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు ఆదర్శ మహిళా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా నెల్లూరుకు చెందిన ఆధ్యాత్మిక గాయకురాలు, సేవకురాలు బి.రాజేశ్వరి చేస్తున్న కృషిని అభినందిస్తూ సంస్థ ఛైర్ పర్సన్ డాక్టర్ జి.సీతా మహాలక్ష్మి, జి.ఎస్.టి.అసిస్టెంట్ కమీషనర్ డాక్టర్ సి.హెచ్.ఉషా కిరణ్ చేతుల మీదుగా మీసాల వజ్రమ్మను శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, మాల, కిరీటదారణతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో అందే శ్రీనివాసులు, షేక్ రియాజ్ బాషా, ఎస్.వి.రమేష్ బాబు, నిర్వాహకులు మురళీమోహన్ రాజు, చీదరాల చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.


