తేది:26-03-2026 నెలూరులోని ప్రతిష్టాత్మక VR మున్సిపల్ హైస్కూల్ (VRAMCH) నందు గురువారం శ్రీరామ నవమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

0
15

✍🏻శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
వేడుకలు ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలికలు పట్టు పావడాలలో అందంగా మెరిసిపోగా, బాలురు ధోతి శైలిలో సాంప్రదాయంగా కనిపించారు.
విద్యార్థులు దేవుడికి పండ్లు, పూలు సమర్పించి భక్తిని వ్యక్తం చేశారు. శ్రీరామ నవమి ప్రాముఖ్యతను శ్రీరాముడు పాటించిన సత్యం, ధర్మం, న్యాయం వంటి విలువలను విద్యార్థులకు వివరించారు.

✍🏻ఈసందర్భంగా విద్యార్థులు రామాయణంలోని సంఘటనలను ఆధారంగా చేసుకొని పాటలు, నాటికలు ప్రదర్శించారు. ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది.ఈకార్యక్రమం హెచ్‌.ఎం.వెంకటరావు ఇన్‌చార్జ్ హెచ్‌.ఎం లక్ష్మీనారాయణ పీ.ఎస్‌.హెచ్‌.ఎం. చంద్రకళ, వైస్ ప్రిన్సిపల్ హరిత, జయలక్ష్మి, పీ.డీ గురు ప్రసాద్ ఏ.ఓ వెంకటరమణ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా నిర్వహించబడింది. ఈకార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. చివరగా ప్రసాదం పంపిణీతో కార్యక్రమం ముగిసింది. ఈవేడుక ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక అవగాహనతో పాటు నైతిక విలువలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here