
✍🏻చదువుతోపాటు కళల్ని ప్రోత్సహించాలని సినీ రచయిత శ్రీరామ్ చౌదరి పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని టౌనుహాలు నందు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నృత్య ప్రదర్శనలు, కళారత్న అవార్డు ప్రదానం, సమ్మర్ సంగీతోత్సవం ఘనంగా జరిగింది.



✍🏻ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మేడిది సుబ్బయ్య ట్రస్టు ఫౌండర్ డాక్టర్ మేడిది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంగీతానికి స్పందించని వారు ఉండరు. సంగీతం అనేది మనుషులు ప్రకటించే గొప్ప అంశం. సంగీతానికిని జాతి, కుల, మత, వర్గ, ప్రాంత, దేశ బేధాలు లేకుండా మనుషుల్ని కలిపే శక్తి ఉంటుందని తెలియజేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వాలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళారత్న అవార్డు గ్రహీతలు డాక్టర్ పి.నారాయణ మూర్తి (హైదరాబాద్), రంగస్థల స్వర బ్రహ్మ జి.రామకృష్ణ (నెల్లూరు), బి.గిరిజలక్ష్మి (సూళ్లూరుపేట), నాట్య మయూరి అపర్ణ (నెల్లూరు) , పందిటి సుబ్బయ్య (నెల్లూరు ), ఎం.వి.ఎన్.ఎస్.దుర్గ (తిరుపతి), సి.హెచ్.రాజా దాసు (డక్కిలి ), నాయబ్ రసూల్ (నెల్లూరు), కె.మస్తానయ్య (చౌటపాలెం) తుమ్మల సీతారామయ్య (యల్లంటి) లను శాలువా, మెడల్, మొమెంటో, ప్రశంసాపత్రం, కిరీట దారణతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో కర్నాటి ఆంజనేయరెడ్డి, డాక్టర్ కె.బాబు అగస్టస్, డాక్టర్ షేక్ ఇంతియాజ్, లక్ష్మీ నారాయణ, బూదాటి రాధాకృష్ణయ్య, మిరియాల వెంకట రమణయ్య, ఎ.ఎం.రత్నం, యనమల నాగేశ్వరరావు, ఎస్.వి.రమేష్ బాబు, షేక్ రియాజ్ బాషా, షేక్ పర్వీన్, అందే శ్రీనివాసులు, బిట్టు సరస్వతి, బలరామాయ్య నాయుడు, మురళీమోహన్ రాజు, చీదరాల చెన్నయ్య, రవి గోగులపల్లి, శ్రీకర్ రెడ్డి, వివిధ జిల్లాల నృత్య కళాకారులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


