

✍🏻మండుతున్న భానుడి భగ భగలు నుండి తమను కాపాడుకునేందుకు ఎండలలో తిరగొద్దని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ చీదరాల చెన్నయ్య పేర్కొన్నారు. అల్లూరు మండలం గొల్లపాలెం ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓరుంపాటి సుజాత ఆధ్వర్యంలో శనివారం ఎండ తీవ్రను తట్టుకోవలసిన జాగ్రత్తలపై గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చీదరాల చెన్నయ్య మాట్లాడుతూ పిల్లలు, వృద్దులు, హృద్రోగులు మధుమేఘ వ్యాధితో బాధ పడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు అధిక ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందాలి. ఎక్కువ నీరు తాగాలి, ఎండలో తిరగరాదని కోరారు. అనంతరం స్కూలు ఉపాధ్యాయులు సుజాత, కృష్ణవేణి లను సత్కరించారు. ఈకార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు ఓరుంపాటి సుజాత, ఉపాధ్యాయులు కృష్ణవేణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


