తేది:30-12-2025 SPRSనెల్లూరు టౌనుహౌస్ పేట లోని వివేకానంద డిగ్రీ కళాశాల నందు “మాదక ద్రవ్యాల వినియోగం వ్యతిరేకతపై అవగాహన సదస్సు” జరిగింది.

0
23

✍🏻మాదక ద్రవ్యాల నిర్మూలన మన లక్ష్యం : సి.ఐ.ఎన్.రామారావు

✍🏻ప్రస్థుతం దేశాన్ని పట్టి పీడుస్తున్న సమస్యల్లో మాదకద్రవ్యాలు అనేది ముఖ్యమైన సమస్యగా మారిందని యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్య నిర్వహణాధికారి ఎ.నాగేశ్వరరావు పేర్కొన్నారు. యువజన సర్వీసుల శాఖ (సెట్నెల్) మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నెల్లూరు టౌనుహౌస్ పేట లోని వివేకానంద డిగ్రీ కళాశాల నందు “మాదక ద్రవ్యాల వినియోగం వ్యతిరేకతపై అవగాహన సదస్సు” జరిగింది. ఈసందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.రామారావు మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడి జీవితాన్ని బుగ్గి పాలు చేసుకుంటున్నారు.

✍🏻దీనివల్ల సమాజంలో తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురిఅవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.వి.ఆర్.స్కూలు కరెస్పాండెంట్ అందే శ్రీనివాసులు మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండి, ఉన్నత చదువులు చదివి మీతల్లిదండ్రుల కలల్ని నిజం చేయాలి. అనవసరమైన స్నేహాలు చేసి తప్పుదోవ పడకుండా మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.

✍🏻ఈకార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు, పోసాని కృష్ణమురళి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దూర్జటి ప్రభాకర్, వివేకానంద కళాశాల డైరెక్టర్ విష్ణువర్ధన్, ప్రిన్సిపాల్ హనుమాన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here