
✍🏻పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రి తాడితోట లోని ఆదిత్య డిగ్రీ కాలేజ్ నందు విద్యార్థులకు ” ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు “జరిగింది….
✍🏻ప్రతి ఒక్కరూ తప్పక ట్రాఫిక్ నియమాలు పాటించాలని రాజమండ్రి అడిషనల్ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ మురళీకృష్ణ గారు పేర్కొన్నారు….
✍🏻ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాన్ని నడపాలి. ట్రాఫిక్ రూల్స్ అనేవి మన కోసం మన బాగుకోసమేనని ప్రతి విద్యార్థి గుర్తించాలని కోరారు.

✍🏻పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు మాట్లాడుతూ ప్రతి మనిషికి వాహనం అనేది మనల్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకొని వెళ్ళే ఒక వస్తువు. అంతే కానీ వాహనం అనేది విలాసవంతమైన యంత్రం కాదని విద్యార్థులు గుర్తించాలని వివరించారు.

✍🏻కార్యక్రమము అనంతరం ఏఎస్పీ మురళీకృష్ణను సత్కరించారు…

✍🏻ఈకార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్.ఆఫీసర్స్ నాగేశ్వరరావు, రమాదేవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…


