⚫తేది:31-మార్చ్-2025 నెల్లూరు జిల్లా కోవూరు మండలం న్యూస్:- నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఈరోజు అనగా 31-మార్చ్-2025 సోమవారం సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన జామియా మజీద్ మరియు టక్కే మజీద్ నందు రంజాన్ వేడుకలు గణనీయంగా జరిగాయి…

0
29

💐 రంజాన్ నెల ప్రాముఖ్యత:- 1.రంజాన్ నెల అన్ని నెలల కంటే ఎంతో ఉత్తమమైన నెలగా మహమ్మదీయ సహోధరులు పేర్కొంటారు.2. ఈ నెలలోనే కురాన్ అవతరించింది 3. ఈ నెలలో స్వర్గ ద్వారాలు తెరవబడతాయి 4. నరక ద్వారాలు మూయబడతాయి 5. సైతాన్ కట్టి వేయబడుతుంది 6. పుణ్యాలు 10 నుండి 700 రెట్లుగా లెక్కింపబడతాయి 7. వెయ్యి నెలల కంటే ఉత్తమమైన రాత్రి (లైలతుల్ ఖదర్)

✍🏻ఈ రంజాన్ వేడుకలను సజాయితముగా, క్రమము తప్పకుండా, జయప్రదంగా జరిగించుటకు కార్యకర్తలుగా నియమితులై జరిగించిన వారు..✍🏻నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద మజీద్ అయినా జాబియా మజీద్ కార్యకర్తలుగా నియమితులైన వారు ఎస్కే సాదిక్ గారు ఎస్కే అఫ్రోజ్ గారు ఎస్ కే దస్తగిరి గారు ఎస్కే ఖాదర్ బాషా గారు✍🏻 నెల్లూరు జిల్లా కోవూరు మండలం చిన్న పడుగుపాడు టాక్కే మసీద్ ప్రెసిడెంట్ ఎస్ డి మసుద్ గారు – పటాన్ ఆఫీస్ గారు- ఎస్.కె జఫ్రూళ్ళ గారు – ఎస్ కె యాస్దని గారు…. ఎంతో నేర్పరితరంతో శాంతియుతంగా సమానత్వ భావాలతో నెల్లూరు జిల్లా కోవూరు మండలం నందు రంజాన్ వేడుకలు ఘనంగా ముగించారు…✍🏻ఒకే నెలలో ఉగాది మరియు రంజాన్ రావడం విశేషకరంగా భావించారు మరియు ఒకే నెలలో రంజాన్ ప్రారంభము మరియు ముగింపు మరింత విశేష కరంగా పేర్కొన్నారు … ✍🏻రంజాన్ మొదటి రోజు నుండి 21వ రోజు వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండి ఉపవాసం ఆచరించి 21వ రోజు నుండి 30వ రోజు వరకు జాగారం రాత్రులుగా జాగారం చేస్తూ 30 రోజులు పూర్తయిన తర్వాత ఫత్రా జహాత్ నవాజ్ చేసి వాజిద్ నమాజ్ తో ముగిస్తారు…

✍🏻రంజాన్ పండుగను ‘ఈద్’ అని ‘ఈద్-ఉల్-ఫితర్’ వ్యవహరిస్తారు..ఈ పండుగ ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభం అవుతుంది. ఆ రోజు రాత్రి చంద్రుడి దర్శనం. చేసుకొన్నప్పటి నుండి ముప్పై రోజులు ఈ పండుగ జరుపుకొంటారు. ముస్లిములందరు ఈ నెల రోజులు మహమ్మద్ ప్రవక్త బోధనలను పఠిస్తారు..,పగలు కనీసం ఒక్కచుక్క మంచినీరైనా ముట్టగూడదనే నియమం పాటిస్తారు. చాలావరకు ఈ నెలలోనే జకాత్ ‘ ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి తమ ఆస్తి, సంపదలపై ఓ లెక్క ప్రకారం పేదలకు చేసే దానధర్మాలనే జకాత్’ అంటారు. పవిత్రమైన జీవన విధానంతో అత్యంత నిష్టతో, భక్తితో వారంతా నెల 1 రోజులు ఉపవాసాలు ఉంటారు. ప్రతి రోజు మసీదుకు వెళ్ళి కనీసం ఐదు పర్యాయాలు నమాజు చేస్తారు. వీటితో పాటు ప్రత్యేక నమాజ్ ‘తరావిహ్ కూడా చేస్తారు. మసీదుకు వెళ్ళలేని వారు ఇండ్ల వద్దనే భక్తిశ్రద్దలతో నమాజ్ చేస్తారు. ఈ రంజాన్ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్’ అవతరిం చిందని మహమ్మదీయుల విశ్వాసం.రంజాన్ మాసంలో తెల్లవారుజామున నాల్గు గంటలకే నిద్రలేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుంటారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనాలు చేస్తారు. . ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని ‘సహెరి అని అంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తరవాత ఉపవాసం విడిచి, నమాజ్ చేస్తారు. ఉపవాసం విడవడాన్ని ‘ ఇఫ్తార్ ‘ అంటారు.✍🏻రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. ఆ నెల మొదటి రోజు చంద్రదర్శనం చేసుకుంటారు. మరునాడు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు. ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఇంటిల్లిపాదీ కొత్తబట్టలు ధరిస్తారు. అత్తరులు పూసుకుంటారు. ‘ఈద్ గాహ్కు వెళ్ళి సామూహిక ప్రార్ధనలు చేస్తారు. నమాజ్ చదివిన తరువాత ఒకరికొకరు ‘ఈద్ ముబారక్! అని శుభాకాంక్షలు తెలుపుతు ఆలింగనం చేసుకుంటారు. ఆ తరవాత సేమియా పాయసంతో కూడిన విందును ఇంటిల్లిపాదీ కలిసి ఆరగిస్తారు. మిత్రులను, బంధువులను కూడా ఈ విందుకు ఆహ్వానిస్తారు. బీదలకు దానధర్మాలు విరివిగా చేస్తారు.✍🏻మహమ్మదీయ సోదరులతో పాటు ఇతర మతాల వారు కూడా ఈ పండుగలో భాగస్వాములవుతారు. మహమ్మదీయ మిత్రులకు వారు పండుగ రోజుల్లో ‘ఇఫ్తార్’ విందులిస్తారు. పండుగనాడు ముస్లిం మిత్రుల గృహాల్లో జరిగే విందులకు హాజరవుతారు. వారికి తమ శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకుంటారు. రంజాన్ పండుగ పవిత్రతకు, క్రమశిక్షణకు మరియు మత సామరస్యానికి ప్రతీక. ఇది నెల రోజుల పండుగ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here