
ఈరోజు అనగా 06- ఏప్రిల్-2025 ఆదివారం నాడు.. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి నిరసనగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం క్రైస్తవ బోధకులు నార్త్ రాజుపాలెం నందు సెంటినరీ బాప్టిస్ట్ సంఘం నుండి రాజుపాలెం వీధుల యందు శాంతియుత ర్యాలీని కొనసాగించారు.. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం సమకూర్చాలని కోరుకుంటూ వారి వేదనను తెలియజేశారు….. అలాగే మతోన్మాదులను అరికట్టాలని వారు నిరసనగా తెలియజేశారు….











పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించిన కారణాలను ఎలాగైనా వెలుగులోనికి తేవాలని ర్యాలీ నందు శాంతియుతంగా నిరసనను తెలియజేశారు…