తేది:29-12-2025 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం తొలి చైర్మన్ గా ఏలూరి శిరీష గారు…

0
2

✍🏻నెల్లూరు నగరంలోని ప్రముఖ దేవస్థానమైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం తొలి చైర్మన్ గా ఏలూరు శిరీష గారు ఎంపికయ్యారు...

✍🏻ఈ మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంఛనంగా ప్రకటించారు. అనంతరం ఆమె దేవస్థానంలో ఏర్పాటుచేసిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని ప్రమాణస్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న నెల్లూరు చెరువు డిస్ట్రిబ్యూటరీ కమిటీచైర్మన్ ఏలూరు శివయ్య నాయుడు సతీమణి ఏలూరు శిరీష కావడం గమనార్హం. పార్టీ పట్ల విధేయతగా పనిచేస్తుండడంతో ఈ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కీలక పదవిని వారికి అప్పగించారు. గతంలో వంశపారపర్యంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి చైర్మన్ లను నియమించేవారు. అయితే తొలిసారిగా ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన జీవోతో ఆలయ చైర్మన్ ను చైర్మన్ అధికారికంగా నియమించారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here