తేది:23-05-2025వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆంద్రప్రదేశ్ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో SPSR నెల్లూరు జిల్లా వారు సమస్యలకు పరిష్కారం చేయాలని అధికారులను కోరుతూ కొద్దిరోజులుగా జరిగే సీహెచ్వోల నిరవధిక సమ్మె 26 రోజులకు చేరింది….

0
38

నెల్లూరు జిల్లా డి .ఎం .హెచ్ .ఓ కార్యాలయం దగ్గర చేస్తున్న సమ్మె 26 వ రోజుకి చేరింది…… ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న కమ్యూనిటీ ఆఫీసర్లు అందరూ వారి సమస్యలను నినాదాలతో యోగ ఆసనాలు వేస్తూ మండుటెండ సహితం లెక్కచేయకుండా వారి నిరసన ప్రదర్శించారు. రెబెకా గారు మాట్లాడుతూ అధికారుల దృష్టికి మా సమస్యను తీసుకొని వెళ్తే మీకు సంబంధించిన యాప్ లో పనిచేయకుండా ఇతర క్యాడర్ల యాప్ ల లో మీరు పని చేసినప్పుడు పని మీరు చేసినట్టు గుర్తించదని మీకు సంబంధించిన CHO, ఆయుష్మాన్ యాప్ లో పనులు చేయమని అధికారులు తెలిపారని తెలియజేశారు. కానీ ప్రథమ దశలో CHO లు పని చేయ్యక పోతే ఆ CHO లకు వత్తిడి పెట్టడం జరుగుతుంది….నిర్ధిష్టమైన జాబ్ చార్ట వుంటే ఎవరి కి సంబంధించిన పని వాళ్ళు చేసుకుంటారు అని జిల్లా కోఆర్డినేటర్ ADILL తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ భాను మహేష్,మాబ్జన్,హెప్సిబా, జ్యోతి మరియు నెల్లూరు జిల్లాలో ని CHOs అందరు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here