
✍🏻వివేకానందుడు ఆదర్శప్రాయుడు : మాజీ ఐ.పి.ఎస్.అధికారి డాక్టర్ సి.ఎన్.గోపినాధ్ రెడ్డి గారు
✍🏻భారతీయ యువతను అద్భుతంగా ప్రభావితం చేసిన స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఐ.పి.ఎస్. అధికారి డాక్టర్ సి.ఎన్.గోపినాధ్ రెడ్డి పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్ శ్రీత్యాగరాయ గానసభ లోని కళా వెంకట దీక్షితులు కళావేదిక నందు శ్రీస్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద జీవితచరిత్ర పై కవిసమ్మేళనం మరియు అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

✍🏻ముందుగా ముఖ్య అతిధులచే జ్యోతి ప్రజ్వల చేశారు.అనంతరం స్వామి వివేకానంద స్ఫూర్తి అవార్డు గ్రహీతలు ఉన్నం వెంకటేశ్వర్లు, కుండా భాస్కర్, ఎస్.రామచంద్ర రావు, ఆలియా భాను, డాక్టర్ వై.శ్రీనివాస బాబు, డాక్టర్ ఆమంచ అంజయ్య, దుబ్బా భాస్కర్, ఎల్.అనురుద్ర రెడ్డి, ఎమ్.ఎస్.కె.షా, బత్తిన నరసింహులు గౌడ్, ఎమ్.డి.శ్రీనివాస్ లను ఘనంగా అవార్డుతో సత్కరించారు.



✍🏻ఈకార్యక్రమంలో సేవారత్న డాక్టర్ మునగా రామ మోహనరావు, విశ్రాంత రెవిన్యూ అధికారి ముద్దపాటి సూర్య నారాయణ, సేవారత్న వడ్లకొండ వెంకట్రావు, మేడిది వెంకట సుబ్బయ్య ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మేడిది వెంకటేశ్వరరావు, కనకదుర్గ నృత్య విభావరి డైరెక్టర్ లయన్ నిర్మలా ప్రభాకర్, కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ రాధ కుసుమ, అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.


