



తేది:05-03-2025 తడ (తిరుపతి జిల్లా ) : తడ మండలంలోని మాంబట్టు గ్రామం అపాచీకు వెళ్లే రోడ్డు ప్రక్కన వున్న చెరువులో బుధవారం ఉదయం గుర్తు తెలియని మహిళ మృతదేహంను గుర్తించి బయటకు తీశారు. ఈ మృతదేహం సుమారుగా నాలుగు రోజుల నుండి ఐదు రోజులుగా చెరువు నీటిలో ఉంటునట్లుగా పోలీసు వారు అంచనా వేస్తున్నారు. ఈ మృతదేహం ను ముందుగా అక్కడే ఉన్న పందులను మెపుకునే వారు తమ పంది ఒకటి కనిపించడం లేదని వెతుకుతున్న సమయంలో వారికి చెరువు నీటి లో మృతదేహం తేలుతూ దుర్వాసన వస్తుండడంతో భయపడి పోలీసు వారికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తాడు సాయంతో బయటకు తీసారు. మృతదేహం పురుగులు పట్టి దుర్వాసన వస్తుంది.బట్టలను బట్టి మృతదేహం మహిళ దిగా గుర్తించారు. మృతదేహం మీద వంగపూత కలర్ బట్టలు వున్నాయి. అయితే పోలీసు వారికి ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని తెలిపారు అలాగే చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఎవరు తెలియదని చెప్పారు.
