తేది :03-12-2025 బుధవారము కొండూరు హరి నారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ 4వార్షికోత్సవ సందర్భంగా భారతరత్న, భారతదేశ ప్రధమ రాష్ట్రపతి డా ” బాబూ రాజేంద్ర ప్రసాద్ జయంతీనీ గణనీయ పరిష్కారం…

0
4

ఘనంగా భారతరత్న, భారతదేశ ప్రధమ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ జయంతి……

భారతరత్న, భారతదేశ ప్రధమ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ సేవల్ని నేటితరం మరువలేనివని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి పేర్కొన్నారు…

డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 4వవార్షికోత్సవం సందర్బంగా డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురస్కరించుకొని బుధవారం రాత్రి హైదరాబాద్ లోని రవీంద్ర భారతి నందు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ స్మారక పురస్కార ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.

ముఖ్య అతిధులు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి 85వ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కోసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా అవార్డు గ్రహీతలు స్వాతంత్ర్య సమరయోధుడు బండ పుల్లారెడ్డి, కె.విజయ ప్రసాద్ రెడ్డి, కామసాని కృష్ణా రెడ్డి, కొత్తూరు రమేష్, డాక్టర్ రాధ కుసుమ, డాక్టర్ వై.వి.సుబ్బారావు లనుఅవార్డు ఘనంగా సత్కరించారు.

ఈకార్యక్రమంలో కారాగారాల శాఖ పూర్వపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.ఎస్.గోపినాధ్ రెడ్డి, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ, కళ పత్రికా సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ, అనాధ విద్యార్థి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్, లయన్ నిర్మలా ప్రభాకర్, నిర్వాహకులు డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి, కె.మురళీమోహన్ రాజు, కుసుమ భోగరాజు, వ్యాఖ్యాత ఎ.హెచ్.తులసీ రామ్, కళాకారులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here